.:: ‘రాష్ట్ర విభజన’ నేపథ్యంలో కొత్త ఉద్యోగాలకు బ్రేక్! ::.
హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ సంబంధిత నోటిఫికేషన్లు నిలిచిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో ఏపీపీఎస్సీ, విద్యాశాఖ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ వ్యవహారం ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలనుకున్న 12,377 పోస్టుల విషయంలో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికిప్పుడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తే ఏమైనా సమస్యలు తలెత్తుతాయా అనే ఆలోచనల్లో పడిన అధికారులు ప్రభుత్వ వివరణ తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
అయితే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో లోకల్, నాన్ లోకల్ అంశాలపై కొరవడే స్పష్టత కారణంగా నోటిఫికేషన్ల జారీని నిలిపివేసే ఆలోచనల్లోనే ప్రభుత్వవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీపీఎస్సీ ఆగస్టులో పోటీ పరీక్షల షెడ్యూలును జారీ చేసి, తమ వద్ద అన్ని క్లియరెన్స్‌లు ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని భావించింది. మరోవైపు రాష్ట్రస్థాయి పోస్టులు అయిన గ్రూపు-1, జోనల్, మల్టీ జోనల్ పోస్టులు, గెజిటెడ్ పోస్టులు అయిన గ్రూపు-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, లెక్చరర్లు వంటి పోస్టుల భర్తీలో కూడా సమస్యలు తప్పవనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక జిల్లా పోస్టులు అయిన గ్రూపు-4, ఉపాధ్యాయ పోస్టులు, ఇతర కేటగిరీల పోస్టుల విషయంలోనూ లోకల్, నాన్ లోకల్ సమస్యలు ఉన్నందున నోటిఫికేషన్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఇక ఆగస్టు 1న జారీ చేయాలనుకున్న డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీకి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. దీంతో 1వ తేదీన నోటిఫికేషన్ జారీ కుదరదు. ఈ పరిస్థితుల్లో లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర నిరాశ తప్పేలా లేదు. అందువల్ల వీటిపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఇటు ఏపీపీఎస్సీ వర్గాలు, అటు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

No comments:
Post a Comment