Saturday, 8 June 2013

Case Booked Against APPSC Employee

.:: ఏపీపీఎస్సీ ఉదంతం పై కేసు నమోదు ::.

హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా ఎంపికయ్యే ఉద్యోగాల పేరుతో బేరసారాలు నిర్వహించిన ఆరోపణలపై నిందితురాలు సంధ్యారాణిపై హైదరాబాద్ సీసీఎస్ అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఈ కథనంపై పోలీసులు ప్రాధమిక విచారణ జరిపారు. సంధ్య అనే మహిళ ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురికి ఎర వేసినట్లు, వారిని తన ఇంటికి పిలిచిన సమయంలో సీతారామరాజు అనే కమిషన్ సభ్యుడు ఆమె ఇంట్లోనే ఉన్నట్లు సదరు కథనంలో చూపించారు. దీని సీడీ కాపీలను కమిషన్ కార్యదర్శి చారుసిన్హా నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మకు అందించిన విషయం విదితమే. ఆ కథనంలో కొన్ని వివాదాస్పద అంశాలు, ప్రముఖుల పేర్ల ప్రస్తావన ఉండటంతో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ గురువారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ పోలీసులు సంధ్యారాణిపై కేసు నమోదు చేశారు.


No comments:

Post a Comment

Designed By Crack Groups